News April 29, 2024

రైతులను నిలబెట్టాలని నాలుగైదు కార్యక్రమాలు చేశాం: కేసీఆర్

image

అశోక్‌ గులాటీ ఆగ్రో ఎకానమిస్ట్‌తో అనేక మాసాలపాటు చర్చించి ఓ నిర్ణయం తీసుకొని రైతులను నిలబెట్టాలని నాలుగైదు కార్యక్రమాలు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సోమవారం రోడ్‌షోలో భాగంగా ఖమ్మం కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతుబంధు ఇచ్చామని, కరెంటు, నీటి తీరువా లేకుండా చేశామని, పాత బకాయిలు రద్దు చేశామని, ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని పేర్కోన్నారు.

Similar News

News November 11, 2024

జిల్లాలో తొలి బయోమైనింగ్ కేంద్రం ప్రారంభం

image

ఇల్లెందు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే కనకయ్య, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జిల్లాలోనే తొలి బయో మైనింగ్ కేంద్రం ఇల్లెందులో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో డంపింగ్ చేసి గుట్టల గుట్టలుగా పెరిగిపోయిన చెత్తను రీసైక్లింగ్ చేసి కాలుష్యం కాకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

News November 11, 2024

కేటీఆర్ ఎవరి కాళ్లు మొక్కేందుకు ఢిల్లీ వెళ్లారు?: పొంగులేటి

image

KTR ఎవరి కాళ్లు మొక్కేందుకు ఢిల్లీ వెళ్లారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేంద్రం పెద్దలను ఒప్పించి తన చెల్లికి బెయిల్ ఇప్పించినట్లే తనను తాను కాపాడుకునేందుకు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లారని విమర్శించారు. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు విదేశాల్లోని సంస్థలకు రూ.55 కోట్లను ఏ విధంగా మళ్లించారని ప్రశ్నించారు. తాను పేల్చబోయే బాంబేదో కేటీఆర్‌కు తెలుసని చెప్పారు. 

News November 11, 2024

KMM: ప్రేమ పేరుతో మోసం.. MLA వద్దకు యువతి

image

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురంకి చెందిన భూక్య సంగీత సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను వేడుకుంది. ముల్కనూరులో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన MLAను కలిసి వినతి పత్రం అందజేసింది. పెద్దకిష్టాపురానికి చెందిన శ్రీకాంత్ తనను మోసం చేసినట్లు పేర్కొంది. ఈ విషయమై PSలో ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని MLAని కోరింది.