News March 25, 2025
రైతులు సద్వినియోగం చేసుకోండి: సత్య శారద

రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. నేటి నుంచి 27 వరకు మూడు రోజులపాటు నక్కలపల్లిలోని జీఎం కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కలెక్టర్ పరిశీలించారు. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 24, 2025
రైతులకు భూ భారతి భరోసా: WGL కలెక్టర్

పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ సత్య శారద దేవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
News April 24, 2025
పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాల స్నాతకోత్సవం

పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాల మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై మెడికల్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ మహేందర్ రెడ్డి, ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదా రెడ్డి, డైరక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.
News April 24, 2025
ఎల్కతుర్తి సభ ఏర్పాట్లపై సీపీతో సమావేశం

ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్‌తో సభ ఏర్పాట్లపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చర్చించారు. సభకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకునే చర్యల గురించి రూట్ మ్యాప్ సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్‌తో సమావేశం అయ్యారు.