News September 15, 2024
రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు: మంత్రి

అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం ఎర్రబాలెంలో ఆయన మాట్లాడుతూ.. పదిమంది రైతులు ముందుకు వచ్చారన్నారు. భారీ వర్షాల కారణంగా రాజధానిలో నిలిచిపోయిన ముళ్లు కంప తొలగింపు 2 రోజుల్లో ప్రారంభిస్తామని, ఐఐటీ రిపోర్టు రాజధాని నిర్మాణం సంబంధించి పాజిటివ్ గా వచ్చిందన్నారు. ఆ రిపోర్టు అధారంగా చేసుకుని నిర్మాణ పనులు చేపడతామన్నారు.
Similar News
News October 30, 2025
GNT: తొలగిన తుపాన్ ముప్పు.. సాధారణ స్థితికి జనజీవనం

తుపాను భయంతో కొద్ది రోజులుగా బిక్కు బిక్కు మంటూ ఇంటిపట్టునే కాలం గడిపిన జనం నెమ్మదిగా తేరుకుంటున్నారు. తుపాను తీరం దాటి ముప్పు తొలగిపోవడంతో రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. వర్షం ముసురు తొలగి సూర్య భగవానుడి రాకతో ఊపిరి పీల్చుకొంటున్నారు. సెలవుల అనంతరం విద్యా సంస్థలు కూడా తెరవడంతో పిల్లలు బడిబాట పట్టారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత వీధులన్నీ రద్దీగా మారి జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది.
News October 30, 2025
ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక.!

మెంథా తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా, కృష్ణా నది ఉపనదులలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో కృష్ణా నదికి వేగంగా వరదలు వస్తున్నట్లు రివర్ కన్జర్వేటర్-కృష్ణ & ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో నేడు 6,00,000 క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని, వరద వేగంగా పెరుగుతోందని చెప్పారు. అన్ని విభాగాలు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 30, 2025
గుంటూరు జిల్లాను ముంచెత్తిన వాన

మొథా తుపాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిశాయి. కాకుమానులో అత్యధికంగా 116.6 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదనందిపాడు 114.6, ప్రత్తిపాడు 109.4, చేబ్రోలు 91.4, కొల్లిపర 78.4, వట్టిచెరుకూరు 76.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తాడేపల్లి, దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురవడంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాలు నీటమునిగాయి.


