News September 15, 2024
రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు: మంత్రి
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం ఎర్రబాలెంలో ఆయన మాట్లాడుతూ.. పదిమంది రైతులు ముందుకు వచ్చారన్నారు. భారీ వర్షాల కారణంగా రాజధానిలో నిలిచిపోయిన ముళ్లు కంప తొలగింపు 2 రోజుల్లో ప్రారంభిస్తామని, ఐఐటీ రిపోర్టు రాజధాని నిర్మాణం సంబంధించి పాజిటివ్ గా వచ్చిందన్నారు. ఆ రిపోర్టు అధారంగా చేసుకుని నిర్మాణ పనులు చేపడతామన్నారు.
Similar News
News October 11, 2024
ఆలపాటిని అఖండ మెజార్టీతో గెలిపించాలి: లావు, ప్రత్తిపాటి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. గురువారం చిలకలూరిపేటలోని టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. 120 రోజుల్లోనే దేశంలో ఎక్కడా జరగని విధంగా పనులు చేశామని యువతకు చెప్పిమరీ ఓట్లు అడగాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులంతా ఓటు నమోదయ్యేలా చూడాలన్నారు.
News October 10, 2024
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా గాదె మధుసూదన్
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాపట్లకు చెందిన మాజీ మంత్రి తనయుడు గాదె మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన మధుసూదన్ రెడ్డి బాపట్ల జిల్లాలో వైసీపీకి కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నూతన కమిటీలలో రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News October 10, 2024
గుంటూరు : విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో పీజీ, డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులు(సెమిస్టర్ బేస్డ్) చదివే విద్యార్థులు అక్టోబర్‌లో రాయాల్సిన పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. http://anucde.info/halltickets.php అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.