News August 8, 2024
రైతుల ఆర్థిక అభివృద్ధిపై మంత్రి పొన్నం దిశానిర్దేశం

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ములకనూరు రైతు వేదిక సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రైతులు వ్యవసాయ ఆధార అనుబంధ పనుల వల్ల ఆర్థిక వృద్ధిపై మంత్రి పొన్నం దిశా నిర్దేశం చేశారు. రైతులకు పాడి పశువుల ద్వారా ఆవులు, గేదెలు, నాటు కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫాం, డ్రాగన్ ఫ్రూట్స్, కూరగాయలు ,మామిడి, జామ , బత్తాయి, నిమ్మ ,కొబ్బరి, మునగ, దానిమ్మ, తదితర తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు.
Similar News
News November 6, 2025
టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గంలో మెదక్ నేతలు

టీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం గురువారం ప్రగతి రిసార్ట్స్‌లో జరిగింది. ఈ సమావేశంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు ఏ. శంకర్ దయాళ్ చారి, ప్రధాన కార్యదర్శి ఏ. సంతోష్ కుమార్ పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. జర్నలిస్టుల సమస్యలు, హక్కులు సహా పలు అంశాలపై చర్చించారు.
News November 6, 2025
మెదక్: అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవినీతి జాడ్యాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రతి రోజు అవినీతి డబ్బుతో ఏసీబీకి దొరకడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి అధికారులు, సిబ్బంది బాధ్యత అన్నారు.
News November 6, 2025
నిజాంపేట: ALERT.. లింక్ క్లిక్ చేస్తే రూ.45 వేలు మాయం

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్ఐ రాజేష్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన మౌనిక ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా వచ్చిన ఫేక్ లింకును క్లిక్ చేయడంతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.45 వేలు పోయినట్లు ఎస్ఐ తెలిపారు. సెల్ ఫోన్‌లో సంబంధం లేని లింకులను, బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దని ఎస్ఐ హెచ్చరించారు. అనుమానాస్పద లింకులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.


