News January 1, 2025

రైతుల ఆలోచన విధానంలో మార్పు రావాలి: కడప కలెక్టర్

image

రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తే వ్యవసాయంలో అత్యధిక లాభాలు గడించవచ్చని కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. మంగళవారం కడప కలెక్టర్‌లోని తన ఛాంబర్‌లో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించాలని రైతులు ఉపయోగించే పనిముట్లు ఇతర వస్తువులను ఆధునికీకరించే దిశగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, రైతులకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

Similar News

News January 20, 2025

కడప: నేడు యథావిధిగా కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని యథావిధిగా నేడు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. గ్రామ మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలు ఏవైనా ఉంటే ప్రజలు నేరుగా కడప కలెక్టరేట్లో రేపు ఉదయం 10:30 గంటల నుంచి అధికారుల దృష్టికి తీసుకుని రావచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 19, 2025

మస్కట్‌లో కడప వ్యక్తి మృతి.. స్పందించిన లోకేశ్

image

కడప బిస్మిల్లా నగర్‌కు చెందిన షేక్ మొహమ్మద్ అనీష్ అన్సారీ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తెప్పించేందుకు సాయం చేయాలని SM ద్వారా ఓ వ్యక్తి మంత్రి లోకేశ్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన లోకేశ్ ‘జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లిన అన్సారీ మృతి చెందటం అత్యంత బాధాకరం. వారిని స్వదేశానికి రప్పించేందుకు సాధ్యమైన ఏర్పాట్లు చేస్తాం. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి అని’ అన్నారు.

News January 19, 2025

గోల్డ్ మెడల్ సాధించిన కడప జిల్లా బిడ్డ

image

బ్రహ్మంగారి మఠానికి చెందిన చిత్రాల జెస్సీ అంతర్జాతీయ పోటీల్లో జంప్ రోప్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించింది. నేపాల్ అంతర్జాతీయ పోటీల్లో ఏపీ తరఫున పాల్గొంది. అత్యుత్తమ ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్‌ను సాధించిన ఆమెను అందరూ అభినందిస్తున్నారు. జెస్సీ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.