News February 25, 2026
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు బడా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని ‘X’ వేదికగా విమర్శించారు. రైతుల కన్నీళ్లతో పాలన సాగించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని హితవు పలికారు. అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే రైతుబంధు నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News April 14, 2026
రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు నల్గొండ జిల్లాలోనే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భానుడు భగభగలాడుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా గుడిపల్లి మండలం గన్‌పూర్‌లో 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అడవిదేవులపల్లిలో 43 డిగ్రీలు, కోదండపురంలో 42.9 డిగ్రీలు, గట్టుప్పల్‌లో 42.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఉమ్మడి జిల్లాలోని 112 ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
News April 14, 2026
VZM: పోస్టూ పోదు.. సీటూ వదలదు..!

ఏపీవీవీపీలో ఓ వైద్యురాలు అటు జీతాన్ని, ఇటు స్టైఫండ్‌ను పొందుతూ నిబంధనలు తుంగలో తొక్కారు. విజయనగరం జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఆమె, పీజీ సీటు వచ్చినా రాజీనామా చేయకుండానే కోర్సులో చేరారు. ప్రసూతి సెలవుల ముసుగులో నెలకు రూ.2 లక్షల జీతం పొందుతూనే, పీజీ స్టైఫండ్‌నూ తీసుకుంటున్నారు. దీనిపై DCHS పద్మశ్రీ రాణి స్పందిస్తూ.. ఇది నేరమని, కళాశాల ప్రిన్సిపల్‌కు లేఖ రాసి విచారణ చేపడతామని తెలిపారు.
News April 14, 2026
కాకినాడ: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. తల్లిని చేసి మోసం చేశాడని ఫిర్యాదు!

ప్రేమించిన యువకుడు మోసం చేశాడని 12 రోజుల శిశువుతో గుంటూరు(D) ప్రత్తిపాడు(M) చెందిన బాధిత యువతి (20) ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. PGRSలో ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకుంది. కాకినాడ(D) మామిదాలకు చెందిన సాయికృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లిని చేసి మొహం చాటేశాడని వాపోయింది. గర్భం దాల్చడానికి కారణం తాను కాదని చెప్తున్నాడని కన్నీటి పర్యంతమైంది.


