News February 12, 2025
రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా?: వైసీపీ

రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా? అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సమీక్ష చేసే ఓపిక ప్రజాప్రతినిధులకు లేదా అని మండిపడ్డారు. వ్యాపారులు, దళారులకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, 9 నెలలు తిరక్కుండానే రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారని ఎద్దేవా చేశారు.
Similar News
News November 14, 2025
రైలు ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం

పెద్దపప్పూరు మండల పరిధిలోని జూటూరు-కోమలి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ట్రాక్ పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. స్థానికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
News November 13, 2025
10 మంది ఉద్యోగులకు ఎంపీడీఓలుగా పదోన్నతి!

అనంతపురం జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న 10 మందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ)గా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ తన క్యాంపు కార్యాలయంలో వారికి నియామక పత్రాలు అందించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు పంచాయతీరాజ్ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
News November 13, 2025
భార్యను హతమార్చిన భర్త

అనంతపురం జిల్లా బెలుగుప్పలో గురువారం దారుణ ఘటన జరిగింది. భార్యను భర్త హతమార్చాడు. స్థానికుల వివరాల మేరకు.. భార్య శాంతిని భర్త ఆంజనేయులు కొడవలితో నరికి చంపాడు. హత్య తర్వాత నిందితుడు బెలుగుప్ప పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


