News February 12, 2025

రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా?: వైసీపీ

image

రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా? అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సమీక్ష చేసే ఓపిక ప్రజాప్రతినిధులకు లేదా అని మండిపడ్డారు. వ్యాపారులు, దళారులకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, 9 నెలలు తిరక్కుండానే రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారని ఎద్దేవా చేశారు.

Similar News

News March 20, 2025

700 మందితో కదిరి బ్రహ్మోత్సవాలలో బందోబస్తు

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో గురువారం సాయంత్రం జరిగే రథోత్సవానికి 700 మందితో బందోబస్తు చేపట్టినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. 6 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 500 మంది సివిల్ పోలీస్ సిబ్బందితో పాటు 100 మంది స్పెషల్ పార్టీ, ఆర్మూర్ రిజర్వుడ్ పార్టీ, 90 మంది ఏపీఎస్పీ పార్టీలతో బందోబస్తు నిర్వహించనున్నామని తెలిపారు. మరో 60 మంది మఫ్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News March 20, 2025

రెండో రోజు 352 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా బుధవారం పదో తరగతి విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. 135 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 352 మంది గైర్హాజరు అయ్యారు. 30,862 మందికి గానూ 30,537 మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ రాంనరగ్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో A, B పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

News March 20, 2025

అనంతపురంలో యువతి ఆత్మహత్య

image

అనంతపురంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మైథిలి అనే యువతి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 10న మైథిలి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!