News January 22, 2025
రైతుల ప్రధాన సమస్యలపై నివేదిక తయారు చేస్తాం: సత్యవతి

జనవరి 24 నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటిస్తామని మాజీ మంత్రి, MLC సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిన దగా, సాగునీటీ కష్టాలు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకొని ఒక నివేదిక తయారు చేస్తామన్నారు. రైతు ఆత్మహత్యలపై ఏర్పాటుచేసిన BRS అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో తొలి సమావేశంలో సత్యవతి పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్పై రేప్ కేసు నమోదు

కేరళ పాలక్కాడ్ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్కూటత్తిల్పై అత్యాచార కేసు నమోదైంది. ఆయన తనను రేప్ చేసి గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకోవాలని బెదిరించాడని ఓ యువతి CM విజయన్కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరి మధ్య ఆడియో రికార్డులు, చాటింగ్ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, చట్టపరంగా కేసును ఎదుర్కొంటానని MLA చెప్పారు. కాగా రాహుల్ ప్రాథమిక సభ్యత్వాన్ని INC రద్దు చేసింది.
News November 28, 2025
HYD: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన సామన్లు సర్దుకున్నట్లు టాక్. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.
News November 28, 2025
పెద్దపల్లి: మొదటి రోజు 76 నామినేషన్లు

జిల్లాలో మొదటి విడతలో కాల్వ శ్రీరాంపూర్, కమాన్పూర్, మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 99 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా మొదటి రోజు గురువారం 76 నామినేషన్ దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. జిల్లాలో 896 వార్డులకు 37 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. కులం, నివాసం సర్టిఫికెట్లు లేని పక్షంలో కనీసం మీసేవలో దరఖాస్తు చేసిన రశీదులను జోడించాలన్నారు.


