News January 22, 2025
రైతుల ప్రధాన సమస్యలపై నివేదిక తయారు చేస్తాం: సత్యవతి

జనవరి 24 నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటిస్తామని మాజీ మంత్రి, MLC సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిన దగా, సాగునీటీ కష్టాలు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకొని ఒక నివేదిక తయారు చేస్తామన్నారు. రైతు ఆత్మహత్యలపై ఏర్పాటుచేసిన BRS అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో తొలి సమావేశంలో సత్యవతి పాల్గొన్నారు.
Similar News
News February 14, 2025
వచ్చేవారం భారత్-బంగ్లా ‘సరిహద్దు’ చర్చలు

సరిహద్దు సమస్యలపై భారత్-బంగ్లాదేశ్ ఈ నెల 17-20 తేదీల మధ్యలో చర్చలు నిర్వహించనున్నాయి. సరిహద్దుల్లో కంచె నిర్మాణం, BSF జవాన్లపై బంగ్లా దుండగుల దాడి వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని BSF ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఇరు దేశాల మధ్య ఇదే తొలి అగ్రస్థాయి సమావేశం.
News February 14, 2025
విశాఖలో కీచక భర్తకు రిమాండ్

<<15458247>>పోర్న్ వీడియోలకు<<>> బానిసైన గోపాలపట్నంకి చెందిన నాగేంద్ర తన భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న విశాఖ పోలీసులు నాగేంద్రపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
News February 14, 2025
నెల్లూరు: పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచనలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.