News December 19, 2024
రైతుల భూ సమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం: కలెక్టర్

రైతుల భూ సమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం ప్యాపిలి మండలం బూరుగలలో రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజల నుంచి భూ సంబంధిత సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, త్వరతిగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News April 19, 2026
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. భార్య నరసమ్మపై భర్త రామయ్య కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఈ దంపతులు, కూతురు శాంతి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకొని ఆసుపత్రికి వచ్చిన రామయ్య నరసమ్మపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు రామయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
News April 19, 2026
కర్నూలు జిల్లాలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానం, సెకండియర్‌లో ఎనిమిదో స్థానం నిలిచిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌లో 22,477 మందికి 16,356 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 18,999 మందికి 16,077 మంది పాసయ్యారు. 2,922 మంది ఫెయిలయ్యారు. సెకండియర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితో పాటు పాసైన వారూ మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ఉంటాయి.
News April 18, 2026
భూగర్భ జలాల పెంచడమే లక్ష్యం: కలెక్టర్

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. శనివారం కోడుమూరు మండలం ఆమడగుంట్లలో నీటి భద్రత, జల ధార జల హారతి కార్యక్రమం నిర్వహించారు. వంకలను, వాగులను, చెరువులను గుర్తించి వాటికి మరమ్మత్ పనులు చేపట్టి నీరు నింపుతామన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నీటిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.


