News November 14, 2024
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొంగులేటి
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, కానీ రైతుల ముసుగులో అధికారులపై దాడులు చేయడం సరికాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలను ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.
Similar News
News November 15, 2024
బోనకల్: 60 ఏళ్ల వృద్ధుడిపై అత్యాచార కేసు
బోనకల్ మండలంలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటయ్య (60) అనే వృద్ధుడిపై అత్యాచార కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుబాబు గురువారం తెలిపారు. ఈ నెల 11న రాత్రి వివాహితను కోటయ్య మేకల షెడ్డులోకి లాక్కెళ్లి మద్యం తాగించి, అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్సై చెప్పారు. ఆమె భర్త ఒంటిపై గాయం గమనించి అడగగా, బాధితురాలు నిజాన్ని వెల్లడించిందన్నారు.
News November 15, 2024
ఖమ్మం: మూడు రోజులు సెలవులు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇవాళ కార్తీక పౌర్ణమి/ గురునానక్ జయంతి, 16న శనివారం వారాంతపు సెలవు, 17న ఆదివారం సాధారణ సెలవు అని ప్రకటించారు. తిరిగి సోమవారం రోజున పునః ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News November 15, 2024
ప్రతి ఒక్కరూ బాల్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ప్రతి ఒక్కరూ తమ బాల్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ, లక్ష్యం నిర్దేశించుకొని మంచిగా చదివి ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, స్థానిక బాల సదనంలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పండిట్ జవహార్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి, పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వేడుకలో పాల్గొని పిల్లలతో సరదాగా గడిపారు.