News December 29, 2024
రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం: కలెక్టర్
సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. పులివెందుల జీజీహెచ్ మార్చురీలో రైతు కుటుంబ సభ్యుల మృత దేహాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి అక్కడికి వచ్చిన రైతు కుటుంబ సమీప బంధువులతో మాట్లాడారు. రైతు కుటుంబ నేపథ్యం, వ్యవసాయంలో లాభనష్టాలు, ఆత్మహత్యకు దారితీసిన ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 26, 2025
కడప డీటీసీ చంద్రశేఖర్‌పై సస్పెన్షన్ వేటు
కడప రవాణా శాఖ కార్యాలయంలో మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జిల్లా రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో విచారించిన అధికారులు అతని తప్పు ఉందని తెలియడంతో అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.
News January 26, 2025
కడప: బస్సులో పొగలు.. ఆగిన బస్సు
తిరుపతి నుంచి ఆదోని వెళ్తున్న RTC సూపర్ లగ్జరీ బస్సు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వల్లూరు సమీపంలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు వెనుక వైపున పొగ రావడం గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌కు తెలిపారు. టెక్నికల్ సమస్యతో బస్సు ముందుకు కదలకపోవడంతో ప్రత్యామ్నాయంగా వేరే బస్సులో ఎక్కించి పంపించారు. దూర ప్రయాణాలు చేసే బస్సుల కండిషన్ సరిగా లేకపోవడం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
News January 26, 2025
చెక్ పోస్టుల్లో కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించాలి: ఎస్పీ
కడప జిల్లాలోని అన్ని చెక్ పోస్టుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గంజాయి, అక్రమ మద్యం, నిషేదిత పదార్థాలు, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి దువ్వూరు పీఎస్ పరిధిలోని ఇడమడక అంతర్ జిల్లా చెక్ పోస్ట్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.