News January 21, 2025

రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం: ADB కలెక్టర్

image

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావ్ కుటుంబాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి పరమార్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రైతు కుటుంబాన్ని పరామర్శించారు. రైతు ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకొని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

Similar News

News February 9, 2025

ఆదిలాబాద్: ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు

image

అన్ని విషయాలు బోధించే ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఉపయోగించే విధానాన్ని తెలుసుకొని ఉండాలని, ప్రతి రోజు వాటిని ఉపయోగిస్తూ విద్యార్థులకు బోధన జరపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో ఆయా భాష ఉపాధ్యాయులకు ఐఎఫ్‌పిలు ఉపయోగించే విధానంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు చేశారు.

News February 8, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శనివారం క్వింటా సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News February 8, 2025

ఇచ్చోడ: రాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. MH చంద్రపూర్‌కు చెందిన గాయక్వాడ్ అంకుస్, భార్య జ్యోతితో జున్ని గ్రామంలోని వారి బంధువుల ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలో NH-44 క్రాస్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని జ్యోతి స్పాట్‌లోనే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు కాగా రిమ్స్ తరలించారు.

error: Content is protected !!