News July 10, 2024
రైతు నష్టపోకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోండి: నంద్యాల కలెక్టర్

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడంతో పాటు నకిలీ విత్తనాల అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
Similar News
News November 24, 2025
అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.

సైబర్ మోసాలపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

ATM డిపాజిట్ మెషిన్లు (CDM), PhonePe/UPIను ఉపయోగించి మోసగాళ్లు అక్రమ లావాదేవీలు జరిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ‘తెలియని వ్యక్తుల కోసం ATM CDMలో డబ్బు జమ చేయండి, PhonePe/UPI ద్వారా పంపండి, కమిషన్ ఇస్తాం’ అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి మనీ లాండరింగ్ & సైబర్ నేరాల కిందికి వస్తాయన్నారు. వాటిలో పాల్గొనేవారు కూడా నేరస్థులే అన్నారు.