News December 1, 2024
రైతు పండుగ.. పరిశీలించిన CS, కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు వేడుకల్లో భాగంగా సభ ప్రాంగణంలో జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్స్‌ను సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
Similar News
News February 18, 2025
ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్ సీఐ, కానిస్టేబుళ్లు

ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుళ్లు పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఒక కేసు విషయంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహులు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
MBNR: సైబర్ వలలో ముగ్గురు వ్యక్తులు.. రూ.1.50లక్షలు స్వాహా

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో నుంచి సైబర్ నేరస్థులు నగదు కాజేసిన ఘటన MBNR జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగికి ఫోన్ చేసి ‘నీపై స్టేషన్‌లో కేసు నమోదైంది.. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తాం.’ అని అనటంతో ఉద్యోగి నమ్మి రూ.90వేలు వారికి పంపించారు. తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మరో ఇద్దరి వ్యక్తుల నుంచి సైతం సుమారు రూ.62వేలను దోచుకున్నారు.
News February 18, 2025
అడ్డాకుల: డ్రోన్ తగిలి గాయాలపాలైన యువ రైతు.!

వరి పంటకు మందు స్ప్రే చేసే డ్రోన్ తగిలి ఓ రైతు గాయాలపాలైన ఘటన అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే రాచాల గ్రామానికి చెందిన రైతు దండు ఆంజనేయులు వరి పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పంటకు మందు స్ప్రే చేయడానికి డ్రోన్ వాడుతున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు డ్రోన్ తగిలి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.