News December 1, 2024
రైతు పండుగ విజయవంతం పట్ల తుమ్మలకు పీసీసీ చీఫ్ అభినందనలు

రైతు పండుగ కార్యక్రమం విజయవంతం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వారి నివాసంలో ఆదివారం పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి అభినందనలు తెలిపారు. రైతాంగంకు ఆధునిక సాగు పద్ధతులు యాంత్రీకరణ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని చెప్పారు. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పై రైతు భరోసా పై యావత్ తెలంగాణ కు స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
ఖమ్మం ఆసుపత్రికి మహర్దశ.. కలెక్టర్ చొరవతో కొత్త రోడ్లు

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దశాబ్దం కాలంగా అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లకు మోక్షం లభించింది. కలెక్టర్ ఆదేశాలతో కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, టాయిలెట్ల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టనున్నారు. దీనివల్ల నిత్యం ఆసుపత్రికి వచ్చే 5 వేల మంది రోగులు, సిబ్బందికి దుమ్ము, ధూళి సమస్యల నుంచి విముక్తి కలగనుంది.
News February 12, 2026
5 మున్సిపాలిటీల్లో కట్టుదిట్టమైన బందోబస్తు: ఖమ్మం కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 5 మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఎంట్రెన్స్, ఎగ్జిట్‌లు, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఏదులాపురం(31), మధిర(22), సత్తుపల్లి(23), వైరా, కల్లూరు (20) వార్డులకు 2 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.
News February 12, 2026
ఖమ్మం: కౌంటింగ్ కేంద్రాల వద్ద BNS 163 అమలు

ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 5 మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. BNS సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, ర్యాలీలు, సభలు, ఐదుగురికిపైగా గుమికూడటం నిషేధమన్నారు. విజయోత్సవాలు, డీజేలు, టపాసులపై నిషేధం విధించారు. అదేరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు.


