News June 20, 2024

రైతు బ‌జార్ల ద్వారా ట‌మోటా: కలెక్టర్ ఢిల్లీ రావు

image

ట‌మోటా ధ‌ర‌లు అధికంగా ఉన్న నేప‌థ్యంలో మార్కెటింగ్ శాఖ‌ చిత్తూరు జిల్లా నుంచి ట‌మోటాను కొనుగోలు చేసి లాభం న‌ష్టం లేని విధంగా వినియోగ‌దారుల‌కు రైతుబ‌జార్ల ద్వారా అందిస్తున్నామని జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ జిల్లా ధ‌ర‌ల ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్‌తో క‌లిసి మార్కెట్లో టమాటాలు, కూర‌గాయ‌ల ల‌భ్య‌త‌తో పాటు వాటి ధ‌ర‌ల‌పై చ‌ర్చించారు.

Similar News

News November 28, 2024

కృష్ణా: ‘ఈనెల 30వరకు ఆ పని చేయకండి’

image

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 30 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం ఉన్నందున జిల్లా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. 

News November 28, 2024

నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న మంత్రి నాదెండ్ల 

image

మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి పర్యటన పామర్రులో ప్రారంభమై పెడన నియోజకవర్గంలోని గూడూరు, పెడన, బంటుమిల్లి మీదగా కృత్తివెన్ను చేరనుంది. పర్యటన సందర్భంగా జిల్లాలోని పలువురు రైతులను కలసి వారి వ్యవసాయ సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం పలు వ్యవసాయ శాఖ కార్యాలయాలను సందర్శించునున్నారు. 

News November 28, 2024

పూర్తైన ఫ్లైఓవర్ పనులు.. మరింత వేగంగా హైదరాబాద్‌కు రాకపోకలు

image

విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిలో భాగమైన ప్రధాన ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కృష్ణా నదిపై సూరయపాలెం-వెంకటపాలెం మధ్య నిర్మిస్తున్న ఈ వంతెనకు ఫినిషింగ్ పనులు, బీటీ రోడ్ నిర్మించాల్సి ఉంది. ఈ వంతెన పూర్తై బైపాస్ రహదారి అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడ రాకుండా జాతీయ రహదారిపైకి వెళ్లవచ్చు. దీంతో విజయవాడలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.