News June 20, 2024
రైతు బజార్ల ద్వారా టమోటా: కలెక్టర్ ఢిల్లీ రావు
టమోటా ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ చిత్తూరు జిల్లా నుంచి టమోటాను కొనుగోలు చేసి లాభం నష్టం లేని విధంగా వినియోగదారులకు రైతుబజార్ల ద్వారా అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్‌తో కలిసి మార్కెట్లో టమాటాలు, కూరగాయల లభ్యతతో పాటు వాటి ధరలపై చర్చించారు.
Similar News
News September 16, 2024
విజయవాడలో 18న ఫుట్‌బాల్ జట్ల ఎంపికలు
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెప్టెంబర్ 18న ఎస్జీఎఫ్ అండర్ 19 ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుట్ బాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత సోమవారం తెలిపారు. ఈ పోటీలకు 01-01-2006 తరువాత పుట్టినవారు అర్హులన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ, స్టడీ, ఆధార్ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఓపెన్‌గా చదివే వారు అనర్హులని చెప్పారు.
News September 16, 2024
ఇబ్రహీంపట్నం SIపై ముంబై నటి జెత్వానీ ఫైర్
ముంబైకు చెందిన సినీ నటి జెత్వానీ ఇబ్రహీంపట్నం PSలో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆమె స్టేషన్‌లో ఉన్న ఓ SIపై ఆగ్రహం వ్యక్తం చేయటం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై నుంచి తనను బంధువుల వద్ద నుంచి అప్పట్లో ఇబ్రహీంపట్నానికి తీసుకువచ్చింది ఈయనే అంటూ ఆమె SIపై గట్టిగా అరిచింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆమె వైపు చూస్తూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో ఆయనపై ఉన్నతాధికారులు నిఘాపెట్టారు.
News September 16, 2024
వైసీపీ 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది: ఉమా
NTR: గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం పేరుతో 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. కోట్ల రూపాయల “నాడు- నేడు” నిధులు దారి మళ్లించిన మాజీ సీఎం జగన్, తాడేపల్లి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఉజ్వల భవిష్యత్తు వైపు రాష్ట్రంలోని విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే లక్ష్యంతో NDA కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.