News April 25, 2024

రైతు బీమా, పంట బీమా చెల్లిస్తాం: మంత్రి తుమ్మల

image

ఎన్నికలు పూర్తికాగానే రైతు బీమా, పంట బీమా చెల్లిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఈ ప్రకటన చేశారు. వారం రోజులుగా వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 చొప్పున పది రోజుల్లోనే వారి ఖాతాలోకి డబ్బును వేయడం జరుగుతుందని తెలిపారు.

Similar News

News January 24, 2025

KMM: క్రీడలు మానసికోల్లాసానికి దోహదం: అడిషనల్ డీసీపీ

image

క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అడిషనల్ డీసీపీ నరేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు పుట్టకోట రోడ్డులోని శ్రీచైతన్య స్కూల్‌లో శుక్రవారం ఉడాన్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనారోగ్య సమస్యలు క్రీడలతో దరిచేరవని విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డి, సైదుబాబు, టెన్నిస్ కోచ్ నాగరాజు పాల్గొన్నారు.

News January 24, 2025

చాపరాలపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

image

ములకలపల్లి మండలం చాపరాలపల్లి గుట్టగూడెం సమీపంలో పేకాట ఆడుతున్న కొంత మంది వ్యక్తులపై పోలీసులు శుక్రవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులతో పాటు రూ.6000 నగదు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ దాడిలో SI కిన్నెర రాజశేఖర్‌తో పాటు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

News January 24, 2025

బాలికలు ఉన్నత రంగాల్లో రాణించాలి: ఖమ్మం కలెక్టర్

image

బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ‘బేటీ పడావో బేటీ బచావో’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బేటీ బచావోకు మద్దతుగా నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ఫ్లెక్సీపై సంతకం చేశారు. బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.