News January 25, 2025

రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: జనగామ కలెక్టర్

image

రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం వచ్చిన రైతులు, ఇంతకు ముందే పాసు పుస్తకం కలిగి ఉండి కూడా దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 31లోగా ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అలాగే బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో రైతుబంధు పొందిన రైతులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.

Similar News

News February 13, 2025

HYD: రంగరాజన్‌పై దాడి.. 12 మంది అరెస్ట్

image

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాచలం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

News February 13, 2025

NGKL: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. వనపర్తి మండలం కిష్టగిరికి చెందన రవీందర్(32) అడ్డాకులలో ఉంటున్నాడు. పెంట్లవెళ్లికి చెందిన షాతో కలిసి రవీందర్ నిన్న రాత్రి బైక్‌పై శాఖాపూర్ వైపు నుంచి అడ్డాకులకు వెళ్తున్నారు. హైవేపై కాటవరం స్టేజీ వద్ద జేసీబీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ అక్కడే మృతిచెందగా షాను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

News February 13, 2025

HYD: రంగరాజన్‌పై దాడి.. 12 మంది అరెస్ట్

image

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాచలం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

error: Content is protected !!