News April 5, 2025
రైలులో బాలికపై అత్యాచారం.. గాంధీలో వైద్యపరీక్షలు

ఈనెల 2న రక్సల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో అత్యాచారానికి గురైన బాలికకు(12) గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, ట్రీట్మెంట్ను అందించారు. కుటుంబ సభ్యులతో HYD వస్తున్న బాలిక.. అర్ధరాత్రి వారంతా నిద్రలో ఉండగా రైల్లో వాష్ రూమ్‌కి వెళ్లింది. ఆ సమయంలో లోపలికి వెళ్లిన బీహార్‌కు చెందిన వ్యక్తి అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 4, 2025
బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: పీడీ

నెల్లూరును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ICDS పీడీ హేనా సుజన్ అన్నారు. గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, CDPOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
News December 4, 2025
VKB: మైక్రో అబ్జర్వర్లు నిబద్ధతతో పనిచేయాలి: యాస్మిన్ భాష

వికారాబాద్‌లో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు యాస్మిన్ భాష ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. 594 గ్రామపంచాయతీలకు 98 మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్లు నిబద్దతతో పనిచేసి పోలింగ్ సరైన విధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరిగింది.
News December 4, 2025
రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో

రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులు తమ సమస్యలు, సూచనలను 0877-2263261 నంబర్‌కు ఫోన్ ద్వారా నేరుగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్‌కు తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమం SVBC ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.


