News February 25, 2025
రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన యువకుడు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన క్రాంతి(29) ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై కల్వరి చర్చి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే ఎస్ఐ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 16, 2025
KNR: క్లైమాక్స్‌కు పల్లె సమరం.. రేసులో 1580 మంది

పల్లె సమరం తుదిదశకు చేరుకుంది. మూడో విడత పోలింగ్‌లో 1580మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. KNRలో 111 GPల్లో 3 ఏకగ్రీవం కాగా 108 స్థానాల్లో పోటీకి 451మంది బరిలో నిలిచారు. సిరిసిల్లలో 87 GPలకు 7 ఏకగ్రీవం కాగా 80 స్థానాలకు 379మంది, జగిత్యాలలో 119 GPల్లో 6 ఏకగ్రీవం కాగా 113 స్థానాలకు 456మంది పోటీ పడుతున్నారు. పెద్దపల్లిలో 91 GPల్లో 6 ఏకగ్రీవం కాగా 85 స్థానాలకు 294మంది రేసులో ఉన్నారు.
News December 16, 2025
తిరుపతి: ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలలో “గిఫ్ట్” వసూళ్లు !

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పలు గ్రామపంచాయతీల్లో అదనపు అంతస్తుల నిర్మాణాలకు అనుమతుల పేరిట అక్రమంగా ‘గిఫ్ట్’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. DKT భూములు మాత్రమే కాకుండా, ఇప్పటికే హ్యాబిటేషన్లుగా మారి ప్రభుత్వ సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఈ వసూళ్లు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి మొత్తానికి కాకుండా తక్కువ నగదుకు రసీదులు ఇవ్వడం గత కొన్ని నెలలుగా సాగుతోందట.
News December 16, 2025
హైదరాబాద్ BDLలో 80 పోస్టులు

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో 80 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు DEC 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MSc(కెమిస్ట్రీ), MBA, CA/ICWAI, PG డిప్లొమా, M.Com ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.1,40,000 చెల్లిస్తారు. వెబ్సైట్:bdl-india.in


