News August 8, 2024
రైలు కిందపడి వ్యక్తి మృతి
గుంతకల్లు రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో గుంతకల్లు బళ్లారి సెక్షన్ బంటనహల్ రైల్వేస్టేషన్ వద్ద బుధవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి(40) బలవన్మరణానికి పాల్పడినట్లు రైల్వే ఏఎస్ఐ రామదాసు తెలిపారు. అతను ట్రాక్‌పై పడుకోవడంతో రైలు వెళ్లినప్పుడు శరీరం నుంచి తల వేరయిందన్నారు. ఇతని వద్ద గుంతకల్లు నుంచి హుబ్లీకి వెళ్లే రైలు టికెట్, తిరుపతి లడ్డూ కవర్ ఉన్నాయని తెలిపారు. మృతుడి పేరు, ఇతర వివరాలు తెలియరాలేదన్నారు.
Similar News
News September 10, 2024
అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు
అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
News September 10, 2024
తాడిపత్రిలో అగ్నిప్రమాదం
తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2024
అనంతపురంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ
అనంతపురంలో ఈ నెల 11న జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహాల ఉరేగింపు ప్రారంభం కావాలని తెలిపారు. 10 అడుగుల కంటే ఎత్తయిన విగ్రహాలను పంపనూరు కెనాల్లో, 10 అడుగులకు తక్కువ విగ్రహాలను రాచన పల్లి వంకల్లో నిమజ్జనం చేయాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.