News April 11, 2025
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నవరం- రావికంపాడు స్టేషన్ మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని (45) వ్యక్తి మృతి చెందాడని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం మృతుడు ఎవరు అనేది తెలియ రాలేదన్నారు. ఆరంజ్ రంగు గడులు టీ షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. కుడి చేతిపై పెద్ద టాటూ ఉందన్నారు. మరిన్ని వివరాలు కొరకు జీఆర్పీ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
Similar News
News April 20, 2025
NZB: రేపు ప్రజావాణి రద్దు

ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి రద్దయ్యింది. సోమవారం జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవం ఉన్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి తిరిగి యథావిధిగా ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు.
News April 20, 2025
BRS ఓటమి తెలంగాణకే నష్టం: కేటీఆర్

TG: ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ కంటే రాష్ట్రానికే ఎక్కువ నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంది. కానీ 500 రోజులైనా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News April 20, 2025
కొమురం భీం జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

కొమురం భీం జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జిల్లా కేంద్రంలో 43.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యాణి, కెరామేరి 43.6, దహేగాం, కౌటాల 43.5, రెబ్బెన 43.4, సిర్పూర్ 43.2, వాంకిడి 43.1, జైనూర్ 42.8, బెజ్జూరు, కాగజ్‌నగర్ 42.6, చింతలమానేపల్లి 42.1, పెంచికల్పేట్ 41.7, సిర్పూర్ (యు) 41.4, లింగాపూర్‌లో 41.2 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.