News July 23, 2024
రైలు నుంచి జారిపడి నెల్లూరు వాసి మృతి

సూళ్లూరుపేట ఇసుకమిట్ట వద్ద రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మృతుడు నెల్లూరుకు చెందిన ఏలూరు కుమార్‌గా గుర్తించారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఉంటాడని వారు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 4, 2025
నెల్లూరు: వీఆర్సీ అండర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలు బంద్

వీఆర్సీ అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలబడడంతో ఆ ప్రాంతంలో అధికారులు రాకపోకలను నిషేధించారు. ఇటీవల ఈ అండర్ బ్రిడ్జి రిపేర్లు చేసిన విషయం తెలిసిందే. సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ నీళ్లు నిలబడడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో వాహనాలను అనుమతించడం లేదు. దీనివల్ల ప్రజలు కిలోమీటర్ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది.
News December 4, 2025
నెల్లూరులో వరినాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్నాయ్..!

నెల్లూరు జిల్లాలోని వరి నాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. జిల్లాలో 11 మండలాల పరిధిలోని 71 గ్రామాల్లో 1,169 హెక్టార్లలో నాట్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 1,775 మంది రైతులు నష్ట పోయారన్నారు. భారీ వర్షాల వల్ల బోగోలు, విడవలూరు, కొడవలూరు, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, అల్లూరు, వెంకటాచలం, బుచ్చి, సంగం, మనుబోలు మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
News December 4, 2025
పవన్ కళ్యాణ్‌కు మంత్రి ఆనం సూచన ఇదే..!

ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్లు కట్టించండి’ అని ఆనం కోరగా ఆలోచన చేస్తామని పవన్ చెప్పారు.


