News April 1, 2025
రైలు నుంచి జారిపడి విశాఖ వాసి మృతి

విశాఖకు చెందిన వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు తుని GRP పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం కాకినాడ(D) గొల్లప్రోలు వద్ద జరిగింది. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ తన కుమార్తె పుట్టి వెంట్రుకలు తీయించేందుకు భార్యతో కలిసి వీక్లీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తున్నాడు. చేయి కడుక్కునేందుకు వాష్ బేసిన్ దగ్గరకు వచ్చిన ఆయన కుదుపులకు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 10, 2025
అనకాపల్లి జిల్లా పోలీస్ పీజీఆర్ఎస్కు 50 ఫిర్యాదులు

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు 50 ఫిర్యాదులను అందజేశారు. ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిశీలించి ఫిర్యాదుదారులతో మాట్లాడారు.భూ తగాదాలకు సంబంధించి 19, రెండు కుటుంబ కలహాలు, రెండు మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర విభాగాలకు చెందినవి 27 ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News November 10, 2025
తల్లి పరీక్ష రాస్తుండగా ఏడ్చిన బిడ్డ.. పాలిచ్చిన పోలీసమ్మ!

ఓ బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది అంటారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. పరీక్ష రాసేందుకు బిడ్డతో సెంటర్కు వచ్చిన ఓ తల్లి.. తన బిడ్డను బయటే ఉంచేసింది. ఆకలితో ఆ శిశువు గుక్కపట్టి ఏడ్వడంతో అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆ బిడ్డను హత్తుకున్నారు. పరీక్ష పూర్తయ్యే వరకూ ఆమె స్వయంగా పాలిచ్చి లాలించారు. కానిస్టేబుల్ చూపిన మాతృప్రేమపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News November 10, 2025
క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్గా TAR-200

ఎలాంటి చికిత్సకు లొంగని మూత్రాశయ క్యాన్సర్ కణతులను(Tumors) TAR-200 అనే ఔషధ పరికరం 3 నెలల్లోనే కరిగించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఇది పాత పద్ధతిలా కాకుండా, ప్రతి 3 వారాలకు నిరంతరంగా కీమో మందును విడుదల చేస్తుంది. మూత్రాశయం తొలగించాల్సిన అవసరం లేకుండా 82% మంది రోగులకు ఈ చికిత్సతో క్యాన్సర్ నయమైంది. క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్గా నిలిచిన దీనికి FDA ఆమోదం తెలిపింది.


