News April 1, 2025
రైలు నుంచి జారిపడి విశాఖ వాసి మృతి

విశాఖకు చెందిన వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు తుని GRP పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం కాకినాడ(D) గొల్లప్రోలు వద్ద జరిగింది. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ తన కుమార్తె పుట్టి వెంట్రుకలు తీయించేందుకు భార్యతో కలిసి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వెళ్తున్నాడు. చేయి కడుక్కునేందుకు వాష్ బేసిన్ దగ్గరకు వచ్చిన ఆయన కుదుపులకు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News April 18, 2025
బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు

జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన మెట్పల్లికి చెందిన యాదగిరి బాబు గురువారం జగిత్యాలలో పదవి బాధ్యతలను స్వీకరించారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. పలువురు ఆయనను అభినందించారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, సత్యనారాయణ రావు తదితరులున్నారు.
News April 18, 2025
భారీగా తగ్గిన ధరలు.. కేజీ రూ.10

తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేట్లు భారీగా పడిపోవడంతో గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతున్నారు. క్వింటా కనీస ధర రూ.800, గరిష్ఠ ధర రూ.1,480 పలుకుతోంది. వారం క్రితం గరిష్ఠ ధర రూ.1,800 నుంచి రూ.2,300 వరకు ఉంది. ఈ సీజన్లో సాగు పెరగడం, క్వాలిటీ లేకపోవడం ధరల పతనానికి కారణాలుగా చెబుతున్నారు. కనీస మద్దతు ధర రూ.1,500 ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ రూ.10-20గా ఉంది.
News April 18, 2025
పనితీరుపై SP ఆరా..పోలీస్ స్టేషన్లలో వరుస తనిఖీలు!

కామారెడ్డి జిల్లా నూతన SP గా గత నేల 9 వ తేదీన బాధ్యతలు స్వీకరించిన రాజేష్ చంద్ర పోలీస్ శాఖలో చురుగ్గా కదులుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిల్లాలోని అన్ని PS లను సందర్శించి…అక్కడి పనితీరును సమీక్షిస్తున్నారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకుంటూ, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు.