News December 5, 2024
రైలు నుంచి దూకేసిన యువతి.. మెడిసిన్ సీటు దక్కలేదనే!
రాయదుర్గం శివారులో రైలు నుంచి దూకి తనూజ (20) అనే <<14787731>>యువతి<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మెడికల్ సీటు రాలేదనే మనస్తాపంతోనే యువతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని సేడంకు చెందిన ఆమె చిత్రదుర్గలో చదువుతున్నారు. మెడికల్ సీటు రాకపోవడంతో ఇక తాను బతకలేనని తల్లిదండ్రులకు చెప్పారు. నిన్న సొంతూరికి వెళ్తూ రాయదుర్గం వద్ద రైలు నుంచి దూకి చనిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 28, 2024
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: అనంత జేసీ
అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 53వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు.
News December 27, 2024
అనంతపురం జిల్లాలో 2,53,489 మందికి పింఛన్
అనంతపురం జిల్లాలో ఈ నెల 31న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. లబ్ధిదారులు అందరూ ప్రతినెలలాగే ఇంటి వద్దే పింఛన్ సొమ్ము పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో 2,53,489 మందికి మొదటి రోజే పంపిణీ చేస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యతో ఆగితే జనవరి 2న ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేస్తారని వెల్లడించారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్.. శ్రీ సత్యసాయి బాబా భక్తుడు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బాబా దర్శనం కోసం వచ్చేవారు. 2010లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 29వ కాన్విగివేషన్ సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమానికి ఆయన అతిథిగా వచ్చారు. అనంతరం 2011లో సత్యసాయి బాబా మరణించిన రోజు వచ్చి కన్నీటి పర్వతమయ్యారు. 2016లో సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు.