News November 19, 2024

రైలు పట్టాలపై తలపెట్టి యువకుడు ఆత్మహత్య

image

తెనాలి రైల్వే స్టేషన్ 5వ ప్లాట్‌ఫారమ్ రైల్వే పట్టాలపై యువకుడి మృతదేహం కలకలం రేపింది. సుమారు 30-32 సంవత్సరాలు కలిగిన యువకుడు జన్మభూమి రైలు వస్తున్న సమయంలో పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు. పట్టాలపై యువకుడు తల పెట్టడంతో శరీరం నుండి తల వేరుగా పడి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు.

Similar News

News February 12, 2026

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పనులు (జి రామ్ జి పనులు) వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టర్ నిర్వహించారు. మార్చి నాటికి నిర్దేశించిన లక్ష్యాలు విధిగా పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనులు పూర్తి చేయుటకు ప్రతి రోజు, ప్రతి వారం వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ఆదేశించారు.

News February 12, 2026

విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలి: DEO

image

మంగళగిరి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి షేక్. సలీమ్ భాష ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అసెస్మెంట్ పుస్తకాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యతను డీఈవో పరిశీలించారు. రానున్న విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రతీ ఉపాధ్యాయుడు కృషిచేయాలని సూచించారు.

News February 12, 2026

GNT: మొదలైన “బిట్స్” క్యాంపస్ పనులు.. మంత్రి లోకేశ్ ట్వీట్

image

అమరావతిలో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ& సైన్స్(బిట్స్) సంస్థ క్యాంపస్ నిర్మాణ పనులు మొదలయ్యాయంటూ మంత్రి లోకేశ్ గురువారం ట్వీట్ చేశారు. కాగా మందడం, వెంకటపాలెంలో క్యాంపస్ నిర్మాణానికి ఆ సంస్థకు 70 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. తొలి దశలో రూ.1,000 కోట్లతో అమరావతిలో బిట్స్ క్యాంపస్ నిర్మిస్తుండగా..AI, ఆవిష్కరణలకు అమరావతి కేంద్రంగా మారుతోందని లోకేశ్ పేర్కొన్నారు.