News May 11, 2024

రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

నార్కట్పల్లి – చిట్యాల రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. నల్గొండ రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి.రజిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని రైలు నుంచి కిందపడి మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడి వయసు 35-40సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 24, 2025

నకిలీ వైద్యులకు కేరాఫ్ నల్గొండ

image

జిల్లాలో నకిలీ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నల్గొండతోపాటు DVK, MLG, అనుముల, NKL, చిట్యాల, చండూరు తదితర ప్రాంతాల్లో నకిలీ వైద్యులు శస్త్ర చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో జిల్లాలో నకిలీ వైద్యుల బాగోతం బయటపడింది. నకిలీ వైద్యులపై జిల్లా వైద్య శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

News December 24, 2025

నల్గొండ జిల్లాలో వణికిస్తున్న చలి

image

జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు చలి గాలులు కూడా వీస్తుండడంతో పల్లె ప్రజలతో పాటు పట్టణ వాసులు ఉదయం పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.

News December 24, 2025

NLG: కేటీఆర్ రాక.. బీఆర్ఎస్‌లో నయా జోష్

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకతో గులాబీ నేతల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా గెలిచిన 230 మంది సర్పంచులను సన్మానించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం కార్యకర్తల్లో జోష్ నింపింది. గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి.. రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ చేసిన ప్రసంగంతో నూతన సర్పంచులు, ఆ పార్టీ కార్యకర్తలు కేరింతలు కొట్టారు.