News November 13, 2024
రైలు ప్రమాద నేపథ్యంలో రైళ్లను దారి మళ్లింపు

గూడ్స్ రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది. రాఘవాపూర్ – రామగుండం మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను నిజామాబాద్ మీదుగా మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేయగా, మధురై, నిజాముద్దీన్, చెన్నై సెంట్రల్ – లక్నో, పలు రైళ్ల దారి మళ్లించారు.
Similar News
News October 23, 2025
కరీంనగర్: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు: సీపీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విద్యార్థుల కోసం వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ సిపి గౌష్ ఆలం తెలిపారు. ‘ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర’, ‘విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండాలి’ అనే అంశాలపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ఉంటాయన్నారు. https://forms.gle/jaWLdt2yhNrMpe3eA ఈ లింకులో ఈనెల 28 వరకు అప్లోడ్ చేయాలన్నారు. ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తామన్నారు.
News October 23, 2025
కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, గతంలో KNR పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు ఈ పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. DCC అధ్యక్ష పదవి కోసం మొత్తం 36 మంది ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
News October 23, 2025
చొప్పదండి పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు

చొప్పదండి పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఈ నిధులు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు చొప్పదండి పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో చొప్పదండి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.