News June 4, 2024
రైల్వే కోడూరు: అరవ శ్రీధర్ విజయం

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ విజయం సాధించారు. ఈయనకు మొత్తం 77701 ఓట్లు పోలవ్వగా.. వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసుకి 67002 ఓట్లు సాధించారు. దీంతో శ్రీధర్ 10699 ఓట్లతో ఘన విజయం సాధించారు. మొదటి సారి ఆయన విజయం సాధించారు. అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లాలో జనసేన జెండా ఎగురవేశారు.
Similar News
News December 1, 2025
కడప: ‘సమస్యలపై ఇవాళ రాకండి’

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుసే అవకాశం ఉండడంతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలతో రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఉండే వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు వినతులు ఇచ్చేందుకు రావొద్దని ఆయన సూచించారు.
News November 30, 2025
వేంపల్లె: 10 రోజుల్లో డెలివరీ.. అంతలోనే విషాదం.!

ఎన్నో ఆశలు.. ఆవిరైపోయాయి. మరో 10 రోజుల్లో కుటుంబంలోకి ఇంకొకరు చేరుతారని కలలుకన్నారు. కానీ ఆ కలల కన్నీళ్లను మిగిల్చాయి. ఈ విషాదకర ఘటన వేంపల్లిలోని పుల్లయ్య తోటలో చోటు చేసుకుంది. భూదేవి(27) అనే గర్భిణీ తన ఇంటి రెండో అంతస్తులో నుంచి కింద పడి మృతిచెందింది. అదే సమయంలో గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమే కాదు.. గ్రామస్థులు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
News November 30, 2025
కడప జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు సెలవు

తుఫాను నేపథ్యంలో కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ సెంటర్లకు సోమవారం సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో శంషుద్దీన్ వెల్లడించారు. విద్యార్థులు కుంటలు, కాలువలు, చెరువులు, పాడుబడ్డ గోడల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.


