News August 13, 2024
రైల్వే కోడూరు: జీతం అడిగినందుకు మహిళపై దాడి

జీతం అడిగినందుకు రూంలో వేసి ఓ మహిళను చితకబాది గాయపరిచిన ఘటన సోమవారం ఒక రైల్వే కోడూరులో జరిగింది. బాధితురాలి కథనం మేరకు రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేటలో ఒక హోటల్లో పావని పనిచేస్తోంది. మూడు నెలల నుంచి హోటల్ యజమాని జీతం ఇవ్వలేదని నిలదీసింది. దీంతో యజమాని హోటల్లోని ఒక గదిలో వేసి తలుపులు మూసివేసి విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News December 8, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు:

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☞ బంగారం 24 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.12775
☞ బంగారం 22 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.11753
☞వెండి 10 గ్రాముల ధర: రూ.1780
News December 8, 2025
కడపకు చేరుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కడపకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆమెకు SP నచికేత్ విశ్వనాథ్ స్వాగతం పలికారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆమె జిల్లాకు వచ్చినట్లు సమాచారం.
News December 8, 2025
రాయచోటిలో ప్రాణం తీసిన కుక్కలు

రాయచోటిలో అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఓ వ్యక్తి బైకుపై వస్తుండగా కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలో కుక్కలు వెంటపడ్డాయి. ఈక్రమంలో అతను అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడిక్కడే మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మృతుడు పజిల్(42)గా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


