News April 5, 2025
రైల్వే కోడూరు: తల్లిదండ్రులపై కేసు నమోదు

రైల్వే కోడూరు పట్టణంలో బైక్ నడుపుతున్న ఇద్దరు మైనర్లను అదుపులో తీసుకుని వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ బాబు తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. నూతన వాహన చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
Similar News
News April 19, 2025
శ్రీనగర్ ASPగా కర్నూల్ వాసి.!

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ ASPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ ASPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
‘జాట్’లో ఆ సీన్ తొలగింపు

జాట్‌లో ఓ సీన్ తమ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటూ క్రైస్తవులు ఆరోపించడంతో ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు మూవీ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఎవరి మనోభావాల్ని గాయపరచడం మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశం పట్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరుతున్నాం’ అని అందులో పేర్కొన్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్‌ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.
News April 19, 2025
ములుగు జిల్లాలో నేటి టాప్ న్యూస్

◆ములుగు: పేదవాడి కన్నీరు తుడవడానికి భూభారతి: పొంగులేటి ◆ములుగు ఆసుపత్రిలో శిశువు మృతి.. కుటుంబీకుల ఆందోళన ◆ఏటూరునాగారం: అడవిలో సిగరెట్ తాగిన వ్యక్తికి జరిమానా ◆బిఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వోలను వాడుకొని తొలగించింది: సీతక్క ◆కాకతీయుల పాలనకు నిదర్శనం రామప్ప ◆వెంకటాపూర్: దేశానికి వెన్నుముక రైతు: మంత్రి కొండా సురేఖ