News August 14, 2024
రైల్వే కోడూరు: బైకు, లారీ ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్
రైల్వే కోడూరు మండలం అనంతరాజు పేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై కోడూరు నుంచి మంగంపేటకు వెళ్తున్న ఇద్దరిని వెనుకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో సిద్దేశ్వర (35), పుల్లగుంట సుబ్బయ్య (42) ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 10, 2024
కొల్లాంకు కడప మీదుగా ప్రత్యేక రైలు
ఓనం పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్ట్యా కాచిగూడ-కొల్లాం-కాచిగూడ రైలును కడప మీదుగా నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కాచిగూడ నుంచి 14వ తేదీ సాయంత్రం రైలు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 12.38కు కడపకు కి చేరుకొని రేణిగుంట, కాట్పడి, త్రిశూర్, ఎర్నాకులం మీదుగా కొల్లాం చేరుకుంటుందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 9, 2024
కడప: ‘మా ఊరి సినిమా’ హీరో మహేశ్ ఇంట్లో భారీ చోరీ
పులివెందులలోని ‘మా ఊరి సినిమా’ చిత్ర హీరో మహేశ్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. రూ.10 లక్షల నగదు, 15 తులాల బంగారు నగలను దుండగులు అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పులివెందులలోని షాదీ ఖానా వెనక భాగంలో మహేశ్ నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న నగదు, బంగారు నగలను దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 9, 2024
కడప జిల్లా వ్యాప్తంగా వర్షపాత వివరాలు
అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. లింగాల మండలంలో అత్యధికంగా 30.2 మి.మీ వర్షం నమోదయినట్లు చెప్పారు. కొండాపురం మండలంలో 1.2 మి.మీ, పులివెందుల 26, వేముల 15, చక్రాయపేట 4, సింహాద్రిపురం 4.4, వేంపల్లిలో 5.4, మైదుకూరు 3.8, ఖాజీపేట 2.8, చాపాడు 2.4, తొండూరు 2.0, సిద్దవటం 1.8, దువ్వూరు 1.6, బద్వేల్, అట్లూరు 1.4, బీ.కోడూరు 1.0, బీ.మఠం మండలంలో 1.2 మి.మీ వర్షం కురిసిందన్నారు.