News March 3, 2025
రైల్వే డివిజన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రిని కలుస్తా:MP కావ్య

ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానిరి కృషి చేస్తున్నామని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో ఎంపీ మాట్లాడారు. రైల్వే సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. , ల్వే డివిజన్ ఏర్పాటు విషయంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలుస్తానని చెప్పారు.
Similar News
News March 20, 2025
త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్: పరిగి MLA

త్వరలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఏర్పాటు కానుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. షాద్‌నగర్ పరిగి మధ్యలోని లక్ష్మీదేవిపల్లి దగ్గర సాగునీటి ప్రాజెక్టు నిర్మించి, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగునీరు, తాగునీరు అందించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఇప్పటికి కూడా కోర్టు కేసులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
News March 20, 2025
సూర్యాపేట జిల్లాలో యువతిపై అత్యాచారం

HNRలో యువతిపై అత్యాచారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై ముత్తయ్య తెలిపిన వివరాలిలా.. పట్టణానికి చెందిన స్వామి రోజాకు ఓ యువతితో పరిచయముంది. రోజా ద్వారా ఆమె ప్రియుడు ప్రమోద్ యువతికి పరిచయమయ్యాడు. ఈనెల 7న ఆ యువతిని ప్రమోద్ ఓ లాడ్జికి తీసుకెళ్లి మద్యం తాపించి అత్యాచారం చేసి ఫోటోలు తీశారు. తిరిగి మంగళవారం ఆ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News March 20, 2025
హైదరాబాద్‌లో OYO 2.O!

HYDలో OYOకు డిమాండ్ పెరిగింది. ఇటీవల సర్వేలోనూ నిజమని తేలింది. పాతబస్తీ గల్లీల నుంచి ORR వరకు ఓయోలే దర్శనమిస్తున్నాయి. చిన్న.. చిన్న లాడ్జీలను సైతం ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. రూ.500కే గదులను అద్దెకు ఇవ్వడంతో జనం క్యూ కడుతున్నారు. హోటళ్లు, గదులను లగ్జరీగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చిల్ అవ్వాలని యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో HYDలో OYO కొత్తపుంతలు తొక్కుతోంది