News March 18, 2025
రైల్వే మంత్రికి మిథున్ రెడ్డి వినతులు ఇవే..!

సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్‌ను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కలిశారు. తిరుపతి- హుబ్లీ ఇంటర్ సిటీ రైలు రెడ్డిపల్లిలో ఆగేలా చూడాలని కోరారు. తిరుపతి నుంచి కడపకు ఉదయం 5:10 గంటలకు బయలుదేరే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఇకపై 6.10 గంటలకు బయలుదేరేలా చూడాలన్నారు. చెన్నై ఎగ్మోర్-ముంబై ట్రైన్‌కు కోడూరు, రాజంపేటలో, హరిప్రియ, సంపర్క్ క్రాంతికి రాజంపేటలో స్టాపింగ్ ఇవ్వాలని విన్నవించారు.
Similar News
News March 19, 2025
చిత్తూరు: లంచం కోసం SI అరాచకం.. మహిళ మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

SI వెంకట నరసింహులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్‌కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.
News March 19, 2025
చిత్తూరు: నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక క్యాంప్‌లను నిర్వహించనున్నారు. జిల్లాలోని సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఈ ప్రత్యేక ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు.
News March 19, 2025
పుంగనూరు: 450 ఏళ్ల చరిత్ర కలిగిన సుగుటూరు గంగమ్మ జాతర

పుంగనూరు నగరి వీధిలో వెలసి ఉన్న సగుటూరు గంగమ్మ జాతరకు జమీందారు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ జాతర ఈనెల 25,26వ తేదీల్లో జరగనుంది. సగుటూరు గంగమ్మ జాతరకు సుమారు 450 సంవత్సరాల చరిత్ర ఉంది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కొలువై ఉండటంతో జిల్లా వాసులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.