News February 12, 2026

రైల్వే శాఖ మంత్రిని కలిసిన కడప ఎంపీ

image

ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌‌ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని కమలాపురం స్టేషన్‌లో చెన్నై – ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ ఏర్పాటు చేయాలని, మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో స్టాపింగ్ కోసం లేఖ ఇచ్చారు. అలాగే జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

ప్రొద్దుటూరు: పిజ్జా సర్వర్‌కి గోల్డ్ మెడల్

image

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

News March 13, 2026

కడప: వంట గ్యాస్ బ్లాక్‌లో అమ్మితే చర్యలే

image

కడప జిల్లాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా, పంపిణీ, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ తదితర వాటిపై గురువారం కడపలో జేసీ సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వంట గ్యాస్ పక్క దారి పట్టకుండా ఏజెన్సీలు డెలివరీ సిబ్బందిపై నిరంతరం పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.

News March 13, 2026

ప్రొద్దుటూరు: పిజ్జా సర్వర్‌కి గోల్డ్ మెడల్

image

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలిగా జీవనం సాగిస్తున్నాడు.