News December 16, 2024
రైల్వే సమస్యలను పరిష్కరించాలి: తిరుపతి ఎంపీ
పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రేణిగుంట-గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం కూడా అత్యవసరమని ఎంపీ గురుమూర్తి తెలిపారు. పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలపై భారం తగ్గించి, ప్రయాణం వేగవంతం చేసేందుకు ఈ కొత్త లైన్ ఎంతో అవసరమనే విషయాన్ని వివరించారు. అలాగే పూడి, ఏర్పేడు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడం ద్వారా కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు.
Similar News
News January 13, 2025
చిత్తూరు: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
రేపు PGRS రద్దు: చిత్తూరు ఎస్పీ
చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ DPRO కార్యాలయంలో రేపు నిర్వహించాల్సిన PGRS రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం భోగి పండుగ సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
News January 12, 2025
భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.