News March 5, 2025
రైల్వే స్టేషన్‌లలో వసతులపై లేఖ రాసిన MP వేమిరెడ్డి

నెల్లూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ల పరిధిలో నెలకొన్న కనీస మౌలిక వసతులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌కు లేఖ రాశారు. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు రైల్వేస్టేషన్‌లో నీటి సమస్యలు, కావలి రైల్వే స్టేషన్ పరిధిలో చెత్త తరలింపు, వర్షాకాలంలో నీటి లీకేజీలు, ట్యాప్ కనెక్షన్లు, స్టేషన్ పరిధిలో బెంచీల ఏర్పాటు చేయాలని MP కోరారు.
Similar News
News March 6, 2025
నెల్లూరు: హౌసింగ్ AE సస్పెన్షన్

జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ AE మధుసూదన్‌రావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ MD రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో HCలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిమెంట్, స్టీల్, ఇసుకను అమ్ముకున్నట్లు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గతంలో HC ఇన్‌ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజు, EE దయాకర్, AEలు జమీర్, వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేశారు.
News March 6, 2025
నెల్లూరు: ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాదు అమ్మాయిల బ్రోకర్’

నెల్లూరుకు చెందిన ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు మ్యాట్రీమోని ద్వారా పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. విజయవాడకు చెందిన అమీర్‌ఖాన్ పరిచయమయ్యాడు. తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని నమ్మించి రూ.15 లక్షల నగదు, 13 సవర్ల బంగారు కట్నకానుకుల కింద తీసుకున్నాడు. ఈ క్రమంలో భర్త అమీర్‌ఖాన్ అమ్మాయిల బ్రోకర్ అని తెలియడంతో భార్య ప్రశ్నించగా.. దాడి చేశాడు. ఆమె నెల్లూరు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 6, 2025
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం: మంత్రి నారాయణ

అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. బుధవారం మంత్రి జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రూ.64 వేల కోట్లతో 5000 ఎకరాలలో రాజధాని నిర్మిస్తామని, ఇప్పటికే రూ.50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ పాల్గొన్నారు.