News March 18, 2025
రైళ్లు ఆలస్యం.. ప్రయాణికులు పడిగాపులు..!

ఖమ్మం మీదుగా వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 83 రైళ్లకు ఖమ్మంలో హాల్టింగ్ ఉంది. రైళ్లు రద్దయినప్పుడు కాకుండా మిగతా రోజుల్లో అన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మూడోలైన్ నిర్మాణ పనుల కారణంగా రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయని.. పనులు పూర్తయితే అన్ని రైళ్లు సమయానికి నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
Similar News
News November 30, 2025
ఎన్నికలు.. ప్రజావాణి తాత్కాలిక రద్దు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున, కలెక్టరేట్లో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి నిలిపివేయబడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అందరూ గమనించి, సహకరించాలని ఆయన సూచించారు.
News November 30, 2025
ఖమ్మం BRSలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతం

ఖమ్మం BRSలో అంతర్గత వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. నిన్నటి ‘దీక్షా దివస్’లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ MLAలు ఎవరికి వారుగా వ్యవహరించారు. మొదట తాతా మధు, సండ్ర, కందాల అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించగా, తరువాత భారీ బైక్ ర్యాలీతో పువ్వాడ బల ప్రదర్శన చేసుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయ వేడుకల్లోనూ ఎవరికి వారే అన్నట్లు ఉండటంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
News November 30, 2025
బీజేపీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా మహిపాల్ రెడ్డి

బీజేపీ జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జుల పేర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు శనివారం ప్రకటించారు. ఇందులో భాగంగా బద్ధం మహిపాల్ రెడ్డి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఖమ్మానికి చెందిన కొండపల్లి శ్రీధర్ రెడ్డిని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్గా, సన్నె ఉదయ్ ప్రతాప్ను నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా నియమించినట్లు వెల్లడించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి.


