News July 9, 2024
రొంపిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. ఏఎస్ఐ మధుసూదన్ వివరాల ప్రకారం.. రొంపిచర్లలోని ఆదర్శ పాఠశాల సమీపంలో హైవేపై సోమవారం సాయంత్రం ఎదురుగా వస్తున్న ట్రక్కును ఆటో ఢీకొని లక్ష్మి(18), అంజమ్మ(40) అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మల్లిక, అయ్యప్ప, ఉరుకుందమ్మ, చంద్ర, నరసింహా, ఈరమ్మ గాయపడినట్లు తెలిపారు. వీరు కర్నూలు జిల్లా కోసిగి నుంచి వచ్చి కూలి పని చేస్తున్నారని తెలిపారు.
Similar News
News October 13, 2024
పేరూరు వద్ద 108 ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి
తిరుపతి రూరల్ మండలం పేరూరు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ దాటుతున్న బైక్‌ను 108 వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు పేరూరుకు చెందిన రిటైర్డ్ అగ్రికల్చర్ ఉద్యోగి సుబ్రమణ్యం రెడ్డిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2024
పలమనేరు : 17న జాబ్ మేళా
APSSDC ఆధ్వర్యంలో 17వ తేదీన పలమనేరు పట్టణంలోని SVCR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, బి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 13, 2024
తిరుపతిలో పెరిగిన చికెన్ అమ్మకాలు
గత నెల రోజులుగా పెరటాసి మాసం కారణంగా మాంసం అమ్మకాలు భారీగా తగ్గాయి. పెరటాసి మాసం ముగియడంతో ఆదివారం ఉదయం నుంచి మాంసం అమ్మకాలు జోరందుకున్నాయి. తిరుపతిలో చికెన్ ధరలు బాయిలర్, లింగాపురం రూ.240, లైవ్ రూ.150, స్కిన్ లెస్ చికెన్ రూ.260 కాగా గుడ్లు రూ.4.50 పైగా అమ్మకాలు సాగుతున్నాయి. త్వరలో కార్తీక మాసం కాగా అమ్మకాలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.