News August 4, 2024
రొంపిచర్ల: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం

రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో స్నేహితుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోహిత్ హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శనివారం వీకెండ్ కావడంతో అదే గ్రామానికి చెందిన బాల అనే స్నేహితుడితో బైకుపై హైదరాబాదుకు వెళ్లాడు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి వస్తున్న క్రమంలో రాత్రి సమయంలో బ్రిడ్జి పైన డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
Similar News
News December 1, 2025
GNT: శీతాకాల సమావేశాలు.. ఎంపీ స్టాండ్ ఏంటి.!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫండింగ్ & ప్రాజెక్టులు, పోలవరం, అమరావతి క్యాపిటల్ రీజన్ అభివృద్ధి నిధులు, రైల్వే & రోడ్ ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, నూతన ప్రాజెక్టులపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.
News December 1, 2025
GNT: నూతన HIV చికిత్స.. బిడ్డకు సోకే ప్రమాదం తగ్గింపు.!

సెప్టెంబర్, 2012 నుంచి జిల్లాలో HIV సోకిన ప్రతి గర్బిణికి 14వ వారము నుంచి నూతన చికిత్స విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తద్వారా బిడ్డకు HIV వచ్చే అవకాశం తగ్గుతుంది. అటు ఈ సంవత్సరం గుంటూరు, తెనాలిలోని సుఖవ్యాధి చికిత్సా కేంద్రాల నుంచి 4,785 మంది సుఖవ్యాధులు సోకినవారు చికిత్స పొందారు. జిల్లాలో షిప్ పాజిటివ్, హ్యాపెన్ సంస్థ, లయన్స్ క్లబ్, ల్యాంప్, రాజీవ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.
News December 1, 2025
గుంటూరు: PGRS సద్వినియోగానికి కలెక్టర్ పిలుపు

మీకోసం వెబ్ సైట్తో పాటూ నేరుగా PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో PGRS కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్, అన్ని కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


