News August 4, 2024
రొంపిచర్ల: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం
రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో స్నేహితుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోహిత్ హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శనివారం వీకెండ్ కావడంతో అదే గ్రామానికి చెందిన బాల అనే స్నేహితుడితో బైకుపై హైదరాబాదుకు వెళ్లాడు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి వస్తున్న క్రమంలో రాత్రి సమయంలో బ్రిడ్జి పైన డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
Similar News
News September 18, 2024
రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్
ఎన్టీఆర్ వైద్య సేవా పథకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి. అరుణ్ బాబు హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా క్రమశిక్షణ సంఘం సమావేశం నిర్వహించారు. కొన్ని ఆసుపత్రులలో రోగనిర్ధారణ నిమిత్తం డా. ఎన్టీఆర్ వైద్య సేవ లబ్దిదారులైన రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
News September 18, 2024
రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు గురువారం ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్‌ల ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
News September 18, 2024
‘ఛానల్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోండి’
గుంటూరు ఛానల్ ఆధునికరణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఇతర అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆధునికీకరణకు సంబంధించి ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేసి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.