News July 10, 2024

రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించిన ఖాదర్ బాషా

image

నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దర్గా ప్రాంగణంలో జరుగుతున్న పనులను బారాషహీద్ దర్గా ఫెస్టివల్ కమిటీ ఛైర్మన్ షేక్ ఖాదర్ బాషా, సయ్యద్ సమీ, సాబీర్ ఖాన్ తదితర నేతలు మంగళవారం పరిశీలించారు. రొట్టెల పండగకు సుమారు పది లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వారికి మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News October 7, 2024

జిల్లాలో 350 వాహనాలు స్వాధీనం: నెల్లూరు SP

image

అనుమతి పొందిన వాహనాల్లోనే ఇసుక రవాణాను అనుమతిస్తామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక యార్డుల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 350 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. నిబంధనల మేరకే ఇసుక రవాణా జరగాలన్నారు.

News October 7, 2024

నెల్లూరులో గజలక్ష్మిగా శ్రీ రాజరాజేశ్వరి

image

నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం అమ్మవారు శ్రీ గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుందరేశ్వర స్వామి సన్నిధిలోనూ విశేష అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి.

News October 7, 2024

జగన్‌ను CMను చేయడమే లక్ష్యం: కాకాణి

image

YCP అధినేత జగన్‌ను CMను చేయడమే తన లక్ష్యమని నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ కోఆర్డినేటర్ ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. కాకాణి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నేతలు పని చేయాలన్నారు. వారికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కాకాణి భరోసా ఇచ్చారు.