News July 11, 2024
రొట్టెల పండగ కమిటీ కార్యదర్శిగా మునీర్

నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా షేక్ మునీర్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత 17 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సేవలను గుర్తించి ఈ ఏడాది రొట్టెల పండగ కమిటీ కార్యదర్శిగా నియమించారు.
Similar News
News December 16, 2025
ఈనెల 19న ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే: కలెక్టర్

ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఈనెల 19న మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతినెలా మూడో శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డేను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News December 16, 2025
నెల్లూరులో మరో లేడీ డాన్.. ఇకపై వివరాలు చెబితే ప్రైజ్ .!

నెల్లూరులో పదేళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు DSP ఘట్టమనేని తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంటిలో 20.90కిలోల గంజాయి లభ్యం అయిందన్నారు. దీంతో ఆమెతోపాటు కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటూ నగదు రివార్డ్ ఇస్తామని DSP పేర్కొన్నారు.
News December 16, 2025
నెల్లూరు జిల్లాకు TDP కొత్త బాస్ ఈయనే.!

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ పేరు ఖరారైంది. కాగా అధికారిక ప్రకటన విడుదల కావల్సి ఉంది. ప్రస్తుతం రవిచంద్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. గతంలోనూ ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.


