News January 5, 2025

రొద్దం: వాట్సాప్ స్టేటస్ పెట్టి యువకుడి ఆత్మహత్య

image

శ్రీసత్యసాయి జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రొద్దం మండలం రాచూరుకు చెందిన సోమిరెడ్డి(28) యువకుడి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. చెల్లికి పెళ్లి కాగా అతను తన తల్లితో కలిసి ఉంటున్నాడు. అప్పుడప్పుడు కారు డ్రైవింగ్‌కు వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ‘నా చావుకు నేనే కారణం’ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. కాసేపటికే రొద్దం-పెనుగొండ మార్గంలోని LGB నగర్ వద్ద చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.

Similar News

News July 7, 2025

పామిడి: ‘నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

image

పామిడి మండల కేంద్రంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 6, 2025

‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

image

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.

News July 6, 2025

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రామాంజి నేయులు

image

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుంతకల్లుకు చెందిన జింకల రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డికి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని వెంకటరామిరెడ్డి ఆయనకు సూచించారు.