News March 19, 2024
రొళ్ల మండలంలో యువతి మృతి

రొళ్ల మండలం కాకి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శివన్న, రాధమ్మ దంపతుల కుమార్తె మేఘన (19) మంగళవారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రొళ్ల ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిరకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 22, 2025
అర్జీలకు పరిష్కారం చూపండి: కలెక్టర్ ఆదేశం

ప్రజల అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు.
News April 21, 2025
ఉమ్మడి అనంత జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి అనంత జిల్లాలో డీఎస్సీ ద్వారా 807 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-314 ➤ BC-A:60 ➤ BC-B:75
➤ BC-C:9 ➤ BC-D:60 ➤ BC-E:29
➤ SC- గ్రేడ్1:20 ➤ SC-గ్రేడ్2:52
➤ SC-గ్రేడ్3:66 ➤ ST:49 ➤ EWS:73
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం<<16156843>> ఇక్కడ క్లిక్<<>> చేయండి.
News April 21, 2025
ATP: పోస్టులు 807.. పోటీ వేలల్లో..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీఎస్సీ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాకు 807 పోస్టులు మంజూరు కాగా టీచర్ ఉద్యోగాలకు సుమారు 40వేల మంది పోటీ పడనున్నట్లు సమాచారం. 202 ఎస్జీటీ పోస్టులకూ 24 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశముంది. దీంతో ఒక్కో టీచర్ పోస్టుకు సగటున 40 మంది, ఒక్కో ఎస్జీటీ పోస్టుకు 120 మందికిపైగా పోటీ పడాల్సిన పరిస్థితి ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.